కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారింది: CM

70చూసినవారు
కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'గతంలో అసెంబ్లీలో ప్రశ్నిస్తే విపక్షాలు అబద్ధాలు చెప్పాయన్నారు. అప్పులపై వాస్తవాలు బయటపడకుండా వ్యవహరించారు. అప్పులు, ఆస్తుల విషయంలో మా ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. కేసీఆర్ ఎగ్గొట్టిన రైతుబంధును మేం అధికారంలోకి రాగానే విడుదల చేశాం. రూ. 7625 కోట్ల బకాయిలను మొదటి విడతగా చెల్లించాం. రైతులకు రూ.17,869 కోట్ల రుణమాఫీ చేశాం' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్