అత్యాచార ఘటనలో మైనర్లు..?
శ్రీసత్యసాయి జిల్లా అత్తాకోడళ్లపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. సీసీ కెమెరాలో నిందితుల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి, ఈ ఘటనలో మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. హిందూపురం త్యాగరాజ్కాలనీకి చెందిన నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. ఈ నిందితులు చోరీలకు పాల్పడే ముఠాగా అనుమానిస్తున్నారు.