అనంతపురంలోని జడ్పీ కార్యాలయంలో ఉమ్మడి అనంత జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ శుక్రవారం అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మండలంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్య నిర్వహణ అధికారి వెంకటసుబ్బయ్య, ఉమ్మడి జిల్లాలోని జడ్పీటీసీలు పాల్గొన్నారు.