స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ తో బిఎల్ నరసింహులు అనే పట్టు చీరల పాలిష్ కార్మికుడు ధర్మవరం పట్టణంలో సంకల్ప మండల దీక్ష శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ కళా ప్రపూర్ణ నటసార్వభౌముడైన ఎన్టీఆర్ కు భారతరత్న తీసుకోవడానికి అన్ని హక్కులు ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వడం లేదో అని ఆయన ప్రశ్నించారు.