గత ప్రభుత్వంలో మంజూరు అయినటువంటి గృహాలను నిర్మించుకోలేని లబ్ధిదారులు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో 2025 మార్చి నాటికి గృహాలు నిర్మించుకోవాలని జనసేన పార్టీ నేత చిలకం మధుసూదన్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ. వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వంలో జనసేన, టీడీపీల కార్యకర్తలను ఎన్నో హింసలకు గురిచేసి ప్రభుత్వ పథకాలు అన్నిటికీ దూరం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి అని పేర్కొన్నారు.