ధర్మవరం మండలం బడన్నపల్లి గ్రామానికి చెందిన కోడెల కాపరి శివయ్యకు చెందిన 41 గొర్రెలు మంగళవారం రాత్రి రైలు కిందపడి చనిపోయాయి. ప్రభుత్వం పరిహారం అందజేసి ఆదుకోవాలని ధర్మవరం సిఐటియు నాయకులు జెవి రమణ బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైలు శబ్దం విని ఒక్కసారిగా రైలు పట్టాలపైకి గొర్రెలు వెళ్లడంతో ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ ఆయూబ్ పాల్గొన్నారు.