ధర్మవరం: ఈనెల 16న కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా

54చూసినవారు
ధర్మవరం: ఈనెల 16న కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తారీకు నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ధర్మవరం సిఐటియు కన్వీనర్ జే వి రమణ తెలిపారు. గురువారం సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ మినీ సెంటర్ లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని ఐసిడిఎస్ కు నిధులు పెంచాలనే కారణాలతో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్