కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ శనివారం ధర్మవరంలో పర్యటించారు. చేనేత కులానికి చెందిన కందికుంట వెంకటప్రసాద్ ను ధర్మవరంలో చేనేత కుల సంఘాల నాయకులు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ ను కదిరిగేట్ వద్ద నుండి వెండి రథంపై ధర్మవరం పట్టణంలోని పురవీధుల్లో ఊరేగించారు. పట్టణంలోని చేనేత కులాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.