ధర్మవరం పట్టణం రాజేంద్రనగర్ లో జ్యోతుల మహోత్సవం బుధవారం తెల్లవారుజామున అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. చేనేతల ఆరాధ్య దైవమైన చౌడేశ్వరి అమ్మవారి పేరు మీద తయారుచేసిన జ్యోతులను వెలిగించి తలపై పెట్టుకుని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా చౌడేశ్వరి దేవి పాటలు భజనలు చేస్తూ లయబద్ధంగా నృత్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్లారు. జ్యోతులను వీక్షించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.