ధర్మవరంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న డొక్కా సీతమ్మ అన్న క్యాంటీను మంగళవారం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ పరిశీలించారు. అన్న క్యాంటీన్ కు వచ్చే వారిని టిఫిన్ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ప్రజలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరికీ నాణ్యమైన భోజనం వడ్డించాలని పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు.