ధర్మవరంలోని ప్రజలందరూ టపాకులు షాపుల వద్ద అగ్గిపెట్టె, సీజర్ లైటు లాంటి వస్తువులు తీసుకెళ్లకూడదని వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బుధవారం పేర్కొన్నారు. పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ లో టపాకుల షాపులు ఏర్పాటు చేశామన్నారు. టపాకులు కొనే వారి ద్విచక్ర వాహనాల్ని గ్రౌండ్ లోకి అనుమతించబోమన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒకచోట పార్క్ చేయాలన్నారు. కాటన్ వస్త్రాలు ధరించి టపాకులు కాల్చాలన్నారు.