ధర్మవరంలోని పాండురంగ స్వామి ఆలయాన్ని సుందరంగా నిర్మిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలతో కలిసి ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.