ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో సోమవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కార్యాలయం ఇన్ఛార్జ్ హరీష్ బాబు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. బీజేపీ నేత హరీష్ బాబు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అర్జీల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య లక్ష్యమని తెలిపారు.