ధర్మవరం పేట బసవన్న కట్ట వీధిలోని శ్రీ త్రిలింగేశ్వర దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవశర్మ మాట్లాడుతూ. ధనుర్మాసం లింగేశ్వరుడికి వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.