ధర్మవరం పట్టణం పేట బసవన్న కట్ట వీధిలో గల శ్రీ త్రిలింగేశ్వర దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవ శర్మ మాట్లాడుతూ కార్తిక మాసం రెండో సోమవారం లింగేశ్వరుడికి వివిధ రకాల పూలతో అలంకరించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.