పెండింగ్ లో ఉన్న మెస్, కాస్మెటిక్ ఛార్జీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ధర్మవరం పట్టణంలో ఏపీఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వసతి గృహ విద్యార్థులకు ఆరు నెలల నుంచి మెస్, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయలేదని వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.