ధర్మవరంలోని పీఆర్డీ సర్కిల్ సుదర్శన కాంప్లెక్స్ వద్ద వీధి లైట్ల విద్యుత్ స్తంభాలు శుక్రవారం నేలకొరిగాయి. దీంతో పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యా రు. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. తుప్పు పట్టడంతోనే స్తంభాలు నేలకొరిగాయని స్థానికులు తెలిపారు.