ధర్మవరంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ అధ్వర్యంలో విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్-2047 అనే అంశంపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంగ్ల అధ్యాపకుడు ఎస్. నారాయణ స్వామి పాల్గొన్నారు. విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్-2047-విద్యాలో నైతిక విలువల ప్రాముఖ్యత అంశంపై అవగాహన కల్పించారు. దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్రను చక్కగా వివరించారు.