గుత్తి పట్టణంలో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ. భారతదేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అందిస్తూ రూపొందించిన భారత రాజ్యాంగానికి నేటితో 74 సంవత్సరాలు పూర్తయ్యాయని అన్నారు.