కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రైతు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26న అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా జరిగే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ నాయక్ పిలుపునిచ్చారు. శనివారం గుంతకల్లులోని స్థానిక బీటీ పకీరప్ప భవనంలో ప్రజాసంఘాల నాయకులతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.