గుత్తి మండలంలో సోమవారం టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండల వ్యాప్తంగా 6 పరీక్షా కేంద్రాలలో 1, 566 మంది విద్యార్థులు హాజరుకావల్సి ఉండగా, 1, 535 మంది విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు మండల విద్యాధికారి రవి నాయక్ తెలిపారు. 31 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు వివరించారు.