గుత్తిలోని ఏడిజె కోర్టు ఆవరణలో ఆదివారం గణతంత్రం దినోత్సవం వేడుకలను న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీహరి, సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ్ చారి, సీనియర్ సివిల్ జడ్జి శ్వేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం గొప్పతనాన్ని గురించి వివరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు.