గుత్తి పట్టణంలోని దాసరి కాలనీలో సోమవారం సీపీఎం మండల కార్యదర్శి నిర్మల ఆధ్వర్యంలో ఇంటింటా ప్రజా పోరు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ. ఈనెల 8 నుంచి 14 వరకు ఇంటింటా ప్రజాపోరు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఉచిత ఇసుకను అమలు చేయాలని, తదితర అంశాలపై ప్రజా పోరు చేపట్టినట్లు పేర్కొన్నారు.