గుత్తి పట్టణంలోని అమృత్ సినిమా థియేటర్ వెనక ఎస్సీ కాలనీలో శనివారం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మట్కా రాస్తున్న ముగ్గురు బీటర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 40, 200 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై సిఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.