గుత్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాలకు ఈనెల 9 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సీఐ గురునాథ్ రెడ్డి ఆదివారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గుత్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా 18 మద్యం దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. రూ.2లక్షల నాన్ రీఫండబుల్ రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.