భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి

50చూసినవారు
భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి
హిందూపురం మున్సిపాల్టీ పరిధిలో భవనాలు నిర్మిస్తున్న యాజమానులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. గురువారం మున్సిపాల్టీలోని 24వ వార్డు వీడీ రోడ్డులో మున్సిపల్ కమిషనర్, టౌన్లోనింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. వార్డులో అనుమతుల మేరకు భవనాలు నిర్మిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అనంతరం అనుమతులు లేకుండా నిర్మించిన వారికి నోటీసులు అందజేశారు.

సంబంధిత పోస్ట్