హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 22 న బుధవారం ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో హ్యుందాయ్ మొబిస్, సియోన్, కిమ్మెల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఐటీఐ, డిగ్రీ, డిప్లమా, బీ. టెక్ చేసినవారు అర్హులు. మరిన్ని వివరాలకు ఐటీఐ కళాశాలలో సంప్రదించవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.