డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఓ యువరైతు ఎడ్లబండి మీద సుదీర్ఘ ప్రయాణం చేపట్టిన విషయం తెలిసిందే. అన్నదాతలు కష్టాలను వివరించేందుకు.. నవీన్ అనే రైతు సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోట నుంచి ఎడ్లబండి మీద ప్రయాణం మొదలు పెట్టారు. ఏకంగా 760 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, మంగళగిరికి చేరుకున్నారు. మూడు రోజుల నిరీక్షణ అనంతరం మంగళవారం నవీన్ ను పవన్ కలిశారు. ఈ సందర్భంగా సమస్య అడిగి తెలుసుకున్నారు.