
హిందూపూరం: ఆవు పై చిరుత దాడి
చిలమత్తూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదేపల్లి గ్రామ సమీపంలో బుధవారం చిరుత దాడిలో ఆవు తీవ్రంగా గాయపడింది. ఆదినారాయణప్ప అనే రైతు ఆవుపై చిరుత దాడి చేయడంతో ఆవు భయభ్రాంతులకు గురై అరవడంతో చుట్టూ ప్రక్క ఉన్న ప్రజలు, రైతులు కేకలు వేయడం వల్ల చిరుత ఎర్ర కొండ అడవిలోకి వెళ్ళిపోయింది. ఇటీవల గొర్రెలను కూడా చంపితింది. చిరుతల దాడి నుండి మా పశువులను కాపాడండి మహాప్రభు అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.