కొడికొండ: ద్విచక్ర వాహనం - కారు ఢీ.. మహిళ మృతి
చిలమత్తూరు మండలం కొడికొండ జాతీయ రహదారిపై పాల సముద్రం నుండి బాగేపల్లి కి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని బెంగళూరు నుండి అనంతపురం వైపు వెళ్తున్న కారు ఢీ కొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న షాను అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. భర్త బాషాకు తీవ్ర గాయాలు కాగా హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొగ మంచు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.