పంట పొలాలను పరిశీలించిన ఏడిఏ

78చూసినవారు
పంట పొలాలను పరిశీలించిన ఏడిఏ
నల్లచెరువు మండలంలోని కమ్మవారి పల్లి, దేవరింటిపల్లి గ్రామాల్లోని పంటపొలాలను ఏడీఏ సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. ఈ గ్రామాలలో అధికంగా మొక్కజొన్న సాగు చేయడంతో ఆ పంట సాగుపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. అనంతరం వ్యవసాయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు అందజేశారు.కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి భారతి, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్