పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా "డొక్కా సీతమ్మ" మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆర్డీఓ వివిఎస్ శర్మ పేర్కొన్నారు. శనివారం కదిరి పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో కదిరి ఆర్డీఓ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల విద్యార్థుల డ్రాపౌట్ల సంఖ్య తగ్గుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.