నంబులపూలకుంట సమీపంలో గంజాయి పట్టుబడినట్లు కదిరి డిఎస్పీ శివనారాయణ స్వామి పేర్కొన్నారు. సోమవారం నంబులపూలకుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ వివరాలను వెల్లడించారు. నంబులపూలకుంట ఎస్ఐ కు రాబడిన పక్కా సమాచారం మేరకు గంజాయిని ఎన్ పి కుంట పరిసర ప్రాంతాల్లో అమ్మాలని ప్రయత్నం చేసే తొమ్మిది మందిని అరెస్ట్ చేసి గంజాయి ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.