విద్యార్థులు సేవాగుణం అలవాటు చేసుకోవాలి

53చూసినవారు
విద్యార్థులు సేవాగుణం అలవాటు చేసుకోవాలి
విజయవాడ వరద బాధితుల కోసం తలుపుల మండల కేంద్రంలో గల శ్రీ సాయి స్కూల్ విద్యార్థులు వారివారి సొంత గ్రామాలలో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ.. సుమారుగా రూ. 10 వేలు నగదును విరాళంగా సేకరించినట్లు తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచే సేవాగుణం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్