Dec 10, 2024, 06:12 IST/నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్: కత్తితో పొడుచుకున్న యువకుడు
Dec 10, 2024, 06:12 IST
పోలీస్ స్టేషన్ లో కత్తితో పొడుచుకొని ఓ యువకుడు హల్చల్ చేశాడు. సీఐ శ్రీనివాస రాజు వివరాల ప్రకారం.. నిజామాబాద్ లోని బోయిగల్లీకి చెందిన దిలీప్ తన భార్య, తల్లితో గొడవ పడగా పోలీసులు 2 టౌన్‌కు తీసుకొచ్చారు. మద్యం మత్తులో ఉన్న దిలీప్ స్టేషన్లో కత్తితో పొడుచుకున్నాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా మరోసారి చేతులపై బ్లేడ్‌తో కొసుకుని హంగామా చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.