టాలీవుడ్ నటుడు మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తాజాగా భార్య నమ్రత పుట్టినరోజు సందర్భంగా తన స్వస్థలం బుర్రిపాలెంలో ఒక స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని ఏర్పాటు చేశారు మహేష్. ఆంధ్రా హాస్పిటల్స్ యాజమాన్యంతో కలిసి టీకా డ్రైవ్‌ను నిర్వహించారు. అక్కడ సుమారు 70 మంది చిన్నారులకి హెచ్‌పీవీ వాక్సిన్ అందజేశారు. గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ ఎంతగానో తోడ్పడుతుందని వైద్యులు తెలిపారు.