షుగర్, అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని మరుసటి రోజు పరగడుపున తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా బరువు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని వివరిస్తున్నారు. జీరా వాటర్ రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుందని.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి మధుమేహం ఉన్నవారికి చక్కని ఉపశమనం లభించేలా చేస్తుందని అంటున్నారు.