కళ్యాణదుర్గం పట్టణంలోని నాయిబ్రాహ్మణ కుటుంబానికి చెందిన ములకనూరు వెంకటేశులు అనే వ్యక్తి అనారోగ్యంతో గత నెల మరణించాడు. ఇంకా నెల కాకముందే మరణించిన అతని భార్యకి పింఛన్ ఇవ్వడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికే సాధ్యమని టీడీపీ నాయకులు తెలిపారు. మరణించిన అతని సోదరుడు రిటైడ్ టీచర్ తిప్పేస్వామి బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సేవల గురించి వివరించారు.