కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ప్రజా వేదికలో ఉచిత డీఎస్సీ మెటీరియల్ సోమవారం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు సౌజన్యంతో ఉచిత కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన అభ్యర్థులు మంచి మార్కులు సాధించాలని వారికి డీఎస్సీ మెటీరియల్ అందజేశారు. శిక్షణ పొందిన అభ్యర్థులు మాట్లాడుతూ శిక్షణాతోపాటు మెటీరియల్ అందజేయడం సంతోషంగా ఉందన్నారు.