కళ్యాణదుర్గం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు సోమవారం విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఏఎస్ఐలు నారాయణరెడ్డి, కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలు, బైక్లు, కార్లు, జీపులు వంటి వాహనాలను తనిఖీ చేశారు. లైసెన్స్, ఆర్సీ, హెల్మెట్ లేని వాహనదారులపై జరిమానా విధించారు. రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.