కళ్యాణదుర్గం పట్టణంలోని మరెంపల్లి కాలనీలో ఉన్న ఎస్టీ వసతి(ఏపిఆర్ఎస్) గృహాన్ని సోమవారం స్థానిక తహశీల్దార్ భాస్కర్ తనిఖీ చేశారు. అక్కడ చదువుతున్న విజయ్ సాయి పాఠశాల నుంచి 11గంటలకు బయటకు వెళ్ళాడు. తిరిగి పాఠశాలకు రాకపోవడంతో సిబ్బందిపై తహశీల్దార్ విచారణ చేయించారు. ఎంతమంది పిల్లలు ఉన్నారన్న దానిపైన శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత హాస్టల్ సిబ్బంది తెలుసుకోవాలని హెచ్చరించారు.