మానవ సమాజంలో సాటి మనిషిని మనిషిగా చూడని దుర్మార్గపు మను స్మృతి నశించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు. బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు మనుస్మృతి ప్రతులను జేఏసీ ఆధ్వర్యంలో తగలబెట్టారు. సాకే హరి మాట్లాడుతూ దేశంలో పశువులకు ఉన్న ప్రాధాన్యత, గౌరవం మనుషులకు లేకుండా పోయిందన్నారు. శూద్రులను అతి శూద్రులని అణచివేస్తూ పీడించడం సరికాదన్నారు.