అనంతపురం జిల్లాలో వెనుకబడిన కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే సురేంద్రబాబు సీఎం చంద్రబాబుకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కుందుర్పి బ్రాంచ్ కెనాలు ద్వారా 114 చెరువులకు సాగునీరు, మహిళలకు డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో 100పడకలకు పెంపు, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.