మిలాద్-ఉన్-నబి సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ముస్లింలు

72చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో మిలాద్-ఉన్-నబి సందర్భంగా సోమవారం ముస్లిం సోదరులు జాతీయ జెండాను పట్టుకొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా నిర్వహించే ఈ పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముస్లిం సోదరులు మసీదులలో ఉదయం నుంచి ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ఖురాన్ గ్రంథంలోని మహమ్మద్ ప్రవక్త వచనాల గురించి వారికి వివరించారు.

సంబంధిత పోస్ట్