నారాయణ పాఠశాలలో పుస్తకాలు సీజ్ చేసిన ఎంఈఓ

56చూసినవారు
నారాయణ పాఠశాలలో పుస్తకాలు సీజ్ చేసిన ఎంఈఓ
కళ్యాణదుర్గం పట్టణంలో స్ధానిక నారాయణ కార్పోరేట్ పాఠశాల నందు పుస్తకాలను ఎఐఎస్ఎఫ్, సిపిఎం నాయకులు మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో సోమవారం సీజ్ చేయించారు. ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతున్న యాజమాన్యంపై మండల విద్యాశాఖ అధికారి విజయకుమారికి పిర్యాదు చేసి సీజ్ చేయించామన్నారు.

సంబంధిత పోస్ట్