అన్ని రాజకీయ పార్టీలతో మడకశిర సీఐ సమావేశం

2094చూసినవారు
అన్ని రాజకీయ పార్టీలతో మడకశిర సీఐ సమావేశం
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం రొళ్ల మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఆదివారం మడకశిర సీఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదో తారీఖున జరుగు జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలలో ఎలాంటి గలాటాలు రాకుండా సజావుగా ఎన్నికలు నిర్వహించుకోవాలి అని మడకశిర సీఐ ప్రజలకు, రాజకీయ నాయకులకు తెలిపారు.

ఎన్నికల్లో ఓటర్లకు నగదు, మద్యం, బహుమతులు వంటివి ఇవ్వకూడదని సీఐ రాజకీయ నాయకులకు సూచించారు. అదేవిధంగా మండలంలో ఎటువంటి సమస్యలు రాకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని రాజకీయ నాయకులకు హుకుం జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై మక్బూల్బాషా ఈఎస్ఐ ధనుంజయ, ఏఎస్ఐ బాలాజీ, జమీందారు మోహన్ పోలీసులు గంగాధర్, దిలీప్ ఉమాశంకర్ శివ న, హోంగార్డులు రామకృష్ణ, వివిధ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్