మైనర్లను పనిలో ఉంచుకోవడం నేరమని సోమందేపల్లి ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. శనివారం శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, ఐసిడిఎస్, స్వచ్ఛంద సంస్థ సిబ్బంది శనివారం ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సోమందేపల్లి మండల కేంద్రంలో ఎస్ఐ రమేష్ బాబు మోటార్ మెకానిక్ షాపులు గుజరి షాపుల వద్దకు వెళ్లి 14 సంవత్సరముల లోపు బాలురు పనిచేయుట నేరమని సూచించారు.