భగీరథ కళ్యాణ మండపం భూమి పూజకు ఎంపీ పార్థసారథికి ఆహ్వానం

80చూసినవారు
భగీరథ కళ్యాణ మండపం భూమి పూజకు ఎంపీ పార్థసారథికి ఆహ్వానం
సోమందేపల్లి మండల సగర/ఉప్పర సంఘం నాయకులు మంగళవారం హిందూపురం పార్లమెంటు సభ్యులు బి. కె. పార్థసారథిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అనంతపురంలోని ఎంపీ గృహములో పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఈ నెల 7వ తేదీన సోమందేపల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న భగీరథ కళ్యాణ మండపం భూమి పూజకు ముఖ్య అతిథిగా అయన ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల భగీరథ సేవా సంఘ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్