నంబులపూలకుంట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద గురువారం ఎంపీపీ రాము ఆధ్వర్యంలో ఉపాధి పనుల్లో జరిగిన సామాజిక తనిఖీల్లో భాగంగా ప్రజా వేదికను నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పీడీ విజయ ప్రసాద్, ఏపిడి రమేష్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో అక్రమాలుకు పాల్పడ్డ క్షేత్రసహాయకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ ఎంపీడీఓ అంజినప్ప, ఏపీఓ చంద్రశేఖర్, ఏసీ రమేష్ పాల్గొన్నారు.