నవ రాత్రుల్లో ముఖ్యమైన మూల నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను బుధవారం రాత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితమ్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదాశ్వీరచన మండపంలో మంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం మంత్రి సవితమ్మ భక్తులతో ముచ్చటించారు. సదుపాయాలు బాగున్నాయని, తాగునీరు, మజ్జిగ అందచేస్తున్నారని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.